అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు : తుమ్మల వీరారెడ్డి

అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు : తుమ్మల వీరారెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా

నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్‌ను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు.  సోమవారం నల్గొండలోని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్  రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గడియారం సెంటర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, బోధనా బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేస్తూ ఒకే ఆన్‌లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని,5జీ నెట్‌వర్క్ కలిగిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలని కోరారు.  కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. సీఐటీయూ జిల్లా నాయకులు ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొడిసెట్టి నాగమణి, బొందు పార్వతి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి భువనగిరి జిల్లా కార్యదర్శి రమ, జిల్లా నాయకులు మణెమ్మ, సునంద సైదమ్మ,  తదితరులు పాల్గొన్నారు.