విక్రమ్ ప్రభు హీరోగా సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిటీ ఆఫ్ గోల్డ్’. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తుండగా అమలా షాజీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేశారు.
ఇంటెన్స్ లుక్‌లో ఉన్న విక్రమ్ ప్రభు.. బంగారు బిస్కట్లను గాలిలోకి విసిరి పట్టుకుంటున్నట్టు కనిపించాడు. గోల్డ్ మార్కెట్, అక్కడ పనిచేసే వ్యక్తులు, సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని ఒక రహస్య వ్యవస్థను ఇందులో చూపించబోతున్నారు.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ నిర్మిస్తున్నారు. అలగం పెరుమాళ్, జాఫర్ ఇడుక్కి, జీఎం సుందర్, వసుంధర, లిజ్జీ ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోయంబత్తూరు, చెన్నై, కేరళలో చిత్రీకరించారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు.
