హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు

హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు

తెలంగాణ హైకోర్టు  తెలంగాణ స్టేట్‌‌ జ్యుడీషియల్‌‌ సర్వీసులో 10 సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. వయసు 23 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా–వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏప్రిల్​ 23న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.tshc.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.