డ్రైనేజీలోకి కార్మికుడిని దింప్రిను

డ్రైనేజీలోకి కార్మికుడిని దింప్రిను

మున్సిపాలిటీల్లో సఫాయి కార్మికులు జీవితాలు ఎలా ఉంటాయో తెలిపే ఘటన ఇది. వరంగల్ నగర మహాపాలక సంస్థ పరిధిలోని  జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. శానిటరీ సిబ్బంది చేత మురుగునీటి కాలువ క్లీనింగ్ పనులను చేయించారు. హనుమకొండలోని 5వ డివిజన్  కొత్తూర్ జెండా కుమారపల్లి ప్రాంతంలో కాలువలో చెత్త చిక్కుకుందని ప్రసాద్ అనే కార్మికుడిని   మురుగు కాలువలోకి దింపి క్లీనింగ్ చేయించారు అధికారులు. చెత్త తీసే క్రమంలో మురుగు నీటి కాలువలో పూర్తిగా మునిగిపోయాడు ఆ కార్మికుడు. 

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో చెత్త క్లీనింగ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే మిషనరీ కొనుగోలు చేస్తున్నా... చివరకు ఓ కార్మికుడిని డ్రైనేజీలోకి దించారు. మురుగునీటిలో మునుగుతూ లేస్తూ.. డ్రైన్ లో ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను చేతులతోనే తొలగించాడు. మ్యాన్ హోల్స్ లో మాన్యువల్ క్లీనింగ్ చేయొద్దనే నిబంధనను అధికారులు పట్టించుకోలేదు.

అనేక ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా.. అధికారులు ఇంత హేయంగా ప్రర్తించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్య కార్మికులను పశువుల మాదిరిగా చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.