నేను సీఎం కావాలని ప్రజలు కోరుతున్నరు : జానారెడ్డి

నేను సీఎం కావాలని ప్రజలు కోరుతున్నరు : జానారెడ్డి

హాలియా, వెలుగు : తాను సీఎం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని, సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని, అయితే తాను ఏ పదవీ కోరుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చునేమోనని, అలా ఏ పదవి వచ్చినా కాదననని చెప్పారు. 21 ఏండ్లకే రాజకీయాల్లోకి వచ్చిన తాను ఏ సీఎం చేయనన్ని శాఖలకు మంత్రిగా చేశానని, తనకు 56 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు.