రాళ్లు వేయండి.. నన్ను అంతం చేయండని చంద్రబాబు పిలుపు: సీఎం జగన్​

రాళ్లు వేయండి.. నన్ను అంతం చేయండని చంద్రబాబు పిలుపు: సీఎం జగన్​

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు ( ఏప్రిల్​ 16) సీఎం జగన్​ బస్సు యాత్ర జరిగింది. భీమవరంలో  జరిగిన సిద్దం సభలో జన సముద్రం కనిపిస్తుందని సీఎం జగన్​ అన్నారు. చంద్రబాబు నాగురించి మాట్లాడేటప్పుడు .. ఆయనకు హైబీపీ వస్తుందని... రాళ్లు వేయండి.. నన్ను అంతం చేయండి అని పిలుపునిస్తారని విమర్శించారు.  చంద్రబాబుకు నాపై చాలా కోపం ఉంది.. అందుకనే ఆయన శాపనార్దాలు పెడుతున్నారన్నారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్కటైనా మంచి గుర్తొస్తుందా అని భీమవరం సభలో ప్రశ్నించారు.  చెరువులో చేపలను నట్టేటా ముంచి కొంగలు తింటున్నట్టు.. జనాలరు నట్టేటా  ఎందుకు ముంచుతున్నారని ప్రశ్నించినందుకే నాపై కోపం పెంచుకున్నాడన్నారు.  ఈ సభలో సీఎం జగన్​ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మన తలరాతను మార్చే ఎన్నికలు అన్నారు.  సంక్షేమం, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తున్నారన్నారు.  కూటమి కుట్రలను ప్రజలు అర్దం చేసుకొని తిప్పి కొట్టాలన్నారు.  పేదలకు.. చంద్రబాబు మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు.

చంద్రబాబు పేరు చెబితే. గుర్తుకు వచ్చేది . కుట్రలు.. మోసాలే..

చంద్ర బాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసం గుర్తుకు వస్తాయన్నారు.  ఆయన జీవితమంతా కుట్రలతో రాజకీయం చేశారంటూ... అన్ని వర్గాలను మోసంతో ముంచేశాడన్నారు.  ఈ ఎన్నికలకు జగన్ కు ​ వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ  ఏకమయ్యాని అన్నారు.  ఒక్కడిపై అందరూ కలిసి దండయాత్ర చేస్తున్నారు.  విపక్షాలు వేసే బాణాలు తగిలేవి జగన్​ కా .. ప్రజలకా అని ప్రశ్నించారు.   విపక్షాలు  బాణాలను  జగన్​ తెచ్చిన సంక్షేమ పథకాలపై వేస్తున్నాయన్నారు.   ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు ఏనాడు ప్రజలకు ఉపయోగించలేదన్నారు.