గాయాన్ని లెక్క చేయని జగన్.. యాత్ర పున:ప్రారంభం

గాయాన్ని లెక్క చేయని జగన్.. యాత్ర పున:ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై రాయితో దాడి చేశారు ఆగంతకులు. అత్యంత వేగంగా వచ్చిన రాయి సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. తగలడంతో ఆయన ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది. ఎమ్మెల్యే వెల్లంపల్లి సీఎం జగన్ పక్కనే ఉండటంతో ఆయనకు గాయం అయ్యింది. బస్సుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

జగన్ కు బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు జగన్. దాడి వెనక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు.