నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీ జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. జరీన్ విజయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయపరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ తో సీఎం స్వయంగా పోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ‘బంగారు పథకాన్ని సాధించి భారత దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేశావు..’ అని నిఖత్ జరీన్ ను సీఎం కేసీఆర్ అభినందించారు.

కాగా, కామన్వెల్త్ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలో ఇవాళ భారత్ సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య మూడుకు పెరిగింది. ఉత్తర ఐర్లాండ్ కు చెందిన కార్లీ ఎంసీ నౌల్ ను ఓడించి గోల్డ్ మెడల్ ను నిఖత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇవాళ ఒక్కరోజే భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు పెరిగింది. బాక్సర్లు  అమిత్ పంఘాల్, నీతు ఘన్ ఘాస్ రెండు బంగారు  పతకాలు సాధించగా, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డ్ హోస్ పాల్ స్వర్ణం సాధించాడు. ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ కు రజతం, రేస్ వాక్  విభాగంలో  సందీప్ కుమార్ కు కాంస్యం దక్కాయి. కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ మొత్తం 48 పతకాలను సాధించగా, వాటిలో 17 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.