రేపు నారాయణఖేడ్కు సీఎం కేసీఆర్

రేపు నారాయణఖేడ్కు సీఎం కేసీఆర్
  • 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్లో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు మమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు స్వయంగా పరిశీలించారు. రేపు మద్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా జుజాల్ పూర్లోని అనురాధ కాలేజీ చేరుకోనున్నారు. అనంతరం సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన  చేస్తారు. ఈ ప్రాజెక్టుతో  సంగారెడ్డి జిల్లాలోని 406  గ్రామాల్లో  3లక్షల 89 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని, 4వేల 5వందల కోట్లతో  ఈ ప్రాజెక్టును  చేపట్టామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం అనురాధ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభ స్థలానికి చేరుకుంటారు. అనంతరం సభను ఉద్ధేషించి సీఎం ప్రసంగిస్తారు. భారీ ఎత్తున జన సమీకరణే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 14 మంది డీఎస్పీలు , 48 సీఐలు, 80 మంది ఎస్సైలు, 1300కు పైగా కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కళావతి’ పాటకు సితార స్టెప్పులు

రీల్ సీఎంగా యడ్యూరప్ప