జనగామ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం

జనగామ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం
  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు 
  • ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్​

జనగామ, వెలుగు: సీఎం కేసీఆర్ శుక్రవారం జనగామకు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. యశ్వంతాపూర్ శివారులో సీఎం బహిరంగ సభ వేదికపై గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా 70 వేల నుంచి 80 వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని భావించామని, తెలంగాణ రాష్ట్రంపై మోడీ వెల్లగక్కిన అక్కసుతో జనం పెద్దసంఖ్యలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. లక్షా 30 వేల మందితో సభను గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నట్లు వెల్లడించారు. నాయకులంతా ప్రజల మధ్యనే ఉండాలని కోరారు. అవసరమైతే బహిరంగ సభ సక్సెస్​కు కష్టపడ్డ లీడర్లందరినీ ఒకరోజు ప్రగతి భవన్​కు తీసుకెళ్లి సీఎంతో మీటింగ్​ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో పాలకుర్తి నియోజకవర్గంలోని 105 మంది దివ్యాంగులకు సీఎం చేతుల మీదుగా ట్రై సైకిల్స్​పంపిణీ చేయనున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ ​మాట్లాడుతూ జనగామ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్​దన్నారు. బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

కోఠి ఆస్పత్రిలో కోటి సమస్యలు

కేసీఆర్​ అవినీతి లెక్కలు తీస్తం