దేశంలో ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణం : కేసీఆర్

దేశంలో ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణం  : కేసీఆర్

దేశంలో మార్పు కోసమే  జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా..ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు, నాయకులు మారినా.. దేశం తలరాత మారలేదన్నారు. దేశంలో ఇప్పటివరకు సాగునీరు, తాగునీరు, కరెంట్  లేదన్నారు. 54 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు బీజేపీ పాలించి  ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. దేశంలో ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని కేసీఆర్ మండిపడ్డారు. 

మహారాష్ట్రలోనే ఎక్కువ మంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులు అత్మహత్య చేసుకుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు  దేశానికే అన్నం పెట్టే రైతు ఎందుకు అత్మహత్య చేసుకుంటుండని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులు నాగలి పట్టడం కాదు చట్టాలు కూడా తయారు చేయాలని కేసీఆర్ సూచించారు. ఏ రాష్ట్రంలో లేనన్ని నదులు మహారాష్ట్రలోనే ఉన్నాయని ...అయినా ఇక్కడి రైతులకు ఆ కన్నీళ్లు ఎందుకన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదని ప్రజలు, రైతులు గెలవాలన్నారు. అబ్‌కీ బార్.. కిసాన్ స‌ర్కార్.. నినాదంతో మందుకెళ్తోన్న బీఆర్ఎస్ కు  దేశవ్యాప్తంగా  మద్దతు లభిస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.