ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ టూర్ ముగించుకుని తమిళనాడులో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఇవాళ( గురువారం) రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. కలాం దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు పలువురు నేతలు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు.
ఈ నెల 10న మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు సీఎం కేసీఆర్. ఇక 11న శ్రీరంగం వెళ్లనున్నారు. 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాల్సి ఉండగా ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉండటంతో వీరి భేటీ రద్దైనట్లు తెలుస్తోంది.
