దుర్గా పూజకు యునెస్కోలో చోటు

దుర్గా పూజకు యునెస్కోలో చోటు

కోల్‌కతా: దుర్గా పూజను సాంస్కృతిక వారసత్వ  ప్రతినిధి జాబితాలో చేర్చినందుకు యునెస్కోకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టారు. సెంట్రల్ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక జోరాసాంకో ఠాకూర్‌బారి నుంచి రెడ్ రోడ్ వరకు సాగనున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు యునెస్కోకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దుర్గా పూజ అనేది ప్రజలందరినీ ఏకం చేసే ఓ భావోద్వేగం అని మమత తెలిపారు. ఇది కళ గొప్పదనాన్ని ఆధ్యాత్మికతతో జోడిస్తుందన్నారు. దుర్గా పూజను సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా ప్రకటించడం రాష్ట్ర  ప్రజలకు దక్కిన గౌరవంగా ఆమె అభివర్ణించారు.