ఓల్డ్​ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తం : సీఎం రేవంత్​రెడ్డి

ఓల్డ్​ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తం : సీఎం రేవంత్​రెడ్డి
  • హైదరాబాద్‌ ప్రతిష్టను పెంచుతం: సీఎం రేవంత్​రెడ్డి
  • పేద, మధ్యతరగతి ప్రజల కోసమే ఓల్డ్‌ సిటీకి మెట్రో
  • ఓల్డ్ సిటీ అంటే పాతబస్తీ కాదు..ఇదే ఒరిజినల్ హైదరాబాద్‌ సిటీ
  • కుతుబ్‌షాహీల నుంచి నిజాం వరకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది
  • మూసీ సుందరీకరణ కోసం రివర్ ​ఫ్రంట్​ ఏర్పాటు 
  • పాతబస్తీలో మెట్రోరైలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

హైదరాబాద్‌, వెలుగు:  హైదరాబాద్ నగర ప్రతిష్టను మరింత పెంచేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఉంటాయని, మిగతా టైమ్‌లో అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని చెప్పారు. డెవలప్​మెంట్​విషయంలో అందరి సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఎంజీబీఎస్​ నుంచి ఫలక్​నుమా వరకు 5.5 కి.మీ.ల మెట్రో ప్రాజెక్టు విస్తరణ పనులకు శుక్రవారం ఆయన పాతబస్తీలో శంకుస్థాపన చేశారు. 

అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓల్డ్ సిటీ అంటే పాతబస్తీ కాదు.. ఇదే హైదరాబాద్​ ఒరిజినల్ సిటీ.. ఈ సిటీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులీకుతుబ్‌షాహీల నుంచి నిజాం నవాబుల వరకు హైదరాబాద్‌ కు అంతర్జాతీయ నగరంగా గుర్తింపు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేశారు. ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది’’ అని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్‌ హయాంలోనే నీటి అవసరాలు తీర్చినం..

గతంలో కాంగ్రెస్ ​ప్రభుత్వ హయాంలోనే 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీళ్లు తీసుకువచ్చామని సీఎం చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి టైంలోనే హైదరాబాద్‌ కు మెట్రో రైల్‌ వచ్చిందని తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌,  ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా అదే సమయంలో వచ్చాయని పేర్కొన్నారు. 

చంచల్‌ గూడ జైలును తరలిస్తం

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని సీఎం ప్రకటించారు. ఆ ప్లేస్​లో మలక్‌పేట, చంచల్‌గూడ, సైదాబాద్‌ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కేజీ టూ పీజీ వరకు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మిరాలం చెరువు వద్ద త్వరలో రూ.363 కోట్లతో బ్రిడ్జ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీళ్లు తీసుకువచ్చామని సీఎం చెప్పారు. వైఎస్‌‌‌‌‌‌‌‌ రాజశేఖరరెడ్డి టైంలోనే హైదరాబాద్​కు మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌ వచ్చిందని తెలిపారు. ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌,  ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా అదే సమయంలో వచ్చాయని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రస్తుతం చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని సీఎం తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజల కోసమే మెట్రో ఫేజ్-2 ..

పేద, మధ్యతరగతి ప్రజల కోసమే మెట్రో ఫేజ్-2ను తీసుకొస్తున్నామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హైటైక్‌‌‌‌‌‌‌‌ సిటీ నుంచి ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌ ద్వారా శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్డ్‌‌‌‌‌‌‌‌కు మెట్రోరైల్‌‌‌‌‌‌‌‌ ను తీసుకెళ్లాలని ప్రయత్నించిందని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్​ కాలంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మెట్రోరైల్​ను ప్రారంభించినప్పుడు.. గౌలీగూడ నుంచి ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా వరకు ఐదున్నర కిలోమీటర్ల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మంజూరై పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందన్నారు. 

ప్రస్తుతం తాను ఆ ప్రాజెక్ట్​ను పూర్తి చేయడానికి బాధ్యత తీసుకున్నానని తెలిపారు. మెట్రో కోసం రోడ్లు విస్త రించడానికి  రూ.200 కోట్లు కేటాయిస్తామని ప్రక టించారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌ వెళ్లే వారు ఎలాగైనా వెళ్తారని.. కానీ, తాము పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నామని రేవంత్​ తెలిపారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ ల నుంచి గల్ఫ్‌‌‌‌‌‌‌‌ దేశాలకు వెళ్లే వారు తమ కుటుంబ సభ్యులతో 20 మంది వరకు ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి సాగనంపాలంటే  కష్టమవుతోందని.. ఈ ప్రాంతాల ప్రజలకు మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌ అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అందుకే ఉప్పల్‌‌‌‌‌‌‌‌ నుంచి నాగోల్‌‌‌‌‌‌‌‌, ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌, ఒవైసీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌, చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్‌‌‌‌‌‌‌‌ దేవులపల్లి , పీ 7 రోడ్‌‌‌‌‌‌‌‌ మార్గం నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌ వరకు మెట్రో నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో 100 ఎకరాల్లో ఏర్పాటయ్యే హైకోర్టు వరకు.. అదే విధంగా ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ వరకు.. రాయదుర్గం నుంచి  ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రి క్ట్‌‌‌‌‌‌‌‌ వరకు, మియాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి రాంచంద్రాపురం వరకు మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తున్నామని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి వెల్లడించారు. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

మూసీ సుందరీకరణకు రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌

గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీ. పరిధిలో మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రకటించారు. దీనికోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే లండన్​లోని థెమ్స్ నదిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి సందర్శించామని తెలిపారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని సబర్బమతీ నది తరహాలో.. గండిపేట నుంచి మొదలుకొని హుస్మాన్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ మీదుగా మూసీ సుందరీకరణ కోసం మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ‘‘కేవలం హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీ అభివృద్ధి మాత్రమే కాదు..హైదరాబాద్​లోని ప్రతీ మూల అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది”అని రేవంత్​ రెడ్డి అన్నారు. దీని కోసం వైబ్రెంట్‌‌‌‌‌‌‌‌  తెలంగాణ–2050 మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్​ను రూపొందిస్తున్నామని,  వచ్చే 25 ఏండ్ల అభివృద్ధి కోసం ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తున్నామని సీఎం వివరించారు. 

పదేండ్లు మేమే అధికారంలో ఉంటం..

హైదరాబాద్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్​దాదాపు పదేండ్లు అధికారంలో ఉంది. ఇప్పుడు మేము కూడా 2024 నుంచి 2034 వరకు పదేండ్లు అధికారంలో ఉంటం.”అని సీఎం ప్రకటించారు.  మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ దేనని రేవంత్​ గుర్తుచేశారు. పాతబస్తీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, అందుకే అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా షబ్బీర్‌‌‌‌‌‌‌‌ అలీని నియమించామని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు నిజాం సర్కారు హయాంలో కట్టిన ఉస్మాన్​సాగర్‌‌‌‌‌‌‌‌, ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌,  ఉస్మానియా యూనివర్సిటీ ఇలా అవే నడుస్తున్నాయన్నారు. ‘‘రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.. ఇచ్చిన మాట ప్రకారం అంతా కలిసి రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మహానగరం అభివృద్ధికి కృషి చేస్తాం”అని రేవంత్​ వివరించారు.

హైదరాబాద్ ప్రతీ గల్లీ తెలుసు..

అధికారంలోకి వచ్చిన వెంటనే  అధికారులను పిలిచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిస్థితులపై ఆరా తీశానని సీఎం  గుర్తు చేశారు. ‘‘నేను ఎక్కడి నుంచో రాలేదు.. నా ఊరు ఎక్కడో కాదు.. పక్కనే ఉన్న కల్వకుర్తి దగ్గరే.. మేము హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రావాలంటే చాంద్రాయణగుట్ట, ఒవైసీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నుంచే రావాలి.. చార్మినార్‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల నుంచి చాంద్రాయణగుట్ట, బహదూర్‌‌‌‌‌‌‌‌పుర వరకు నాకు ప్రతి గల్లీ తెలుసు.. చుడీ బజార్‌‌‌‌‌‌‌‌, పత్తర్‌‌‌‌‌‌‌‌ గట్టీ, కబూతర్‌‌‌‌‌‌‌‌ ఖానా ఎక్కడుందో.. ఇక్కడ ప్రతీది తెలుసు.. మదీనాలో బిర్యానీ.. చాయ్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటాయే ప్రతి విషయం నాకు తెలుసు”అని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. అలాగే,  పాతబస్తీ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ గెలవాలని ప్రయ త్నించినా ఫలించలేదన్నారు. ఎంఐఎం ఎంపీగా అసుదుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఇక్కడి ప్రజల వాయిసే కాకుండా, దేశంలోని 140 కోట్ల ప్రజల గొంతుకను వినిపిస్తున్నారని రేవంత్​ ప్రశంసించారు.