నాగుపాము బూట్లు..పడగ విప్పి భయపెట్టిస్తున్నాయి

నాగుపాము బూట్లు..పడగ విప్పి భయపెట్టిస్తున్నాయి

మార్కెట్లో అనేక రకాల షూలు దర్శనమిస్తాయి. ఇందులో కొన్ని వింతగా ఉంటాయి. మరికొన్ని భిన్నంగా కనిపిస్తాయి. ఇంకొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. కానీ ఈ షూలు మాత్రం..భయపెట్టిస్తున్నాయి. కోబ్రా లాంటి షూలను చూసి జనం షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ నాగుపాము షూలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ వీడియోలో ఓ మహిళ కోబ్రా హుడ్ తరహా షూలు వేసుకుంటోంది. ఈ షూలు అచ్చం నాగుపామునే తలపిస్తున్నాయి. నాగుపాము చర్మం, పడగవిప్పిన నాగుపాము తల, నాగుపాము చర్మంపై ఉండే చారలు..ఎలా ఉంటాయో..అచ్చం అలాగే ఈ షూలు ఉండటం గమనార్హం. 

నాగుపాము వలే ఉన్న షూలను ధరించడంపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ డిజైన్ ను కొంత మంది మెచ్చుకుంటుండగా..మరి కొందరు..నాగుపాము దేవుడిగా కొలుస్తారని..అలాంటి నాగుపాము షూలు వేసుకుని అగౌరవపరిచాడని కామెంట్ చేశారు. 

ALSO READ : పెదమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు