
పాపం ఓ యువకుడి పాము ఏడుగంటలు చుక్కలు చూపించింది. కదిలితే ప్రాణం పోతుందని బయపడ్డ యువకుడు కదలకుండా విగ్రహంలా నిలబడ్డాడు. చివరికి స్థానికుల జోక్యంతో ప్రాణాల్ని కాపాడుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా జమాల్పూర్ గ్రామంలో కరెంట్ స్తంబాల మరమ్మత్తులు జరుగుతున్నాయి. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ పనులు చేస్తూ తోటి కార్మికులతో అంగన్‌వాడీ కేంద్రంలో నిద్రపోయాడు.
పగలంతా పని చేసిన అతను ఆదమరచి నిద్రలోకి జారుకుడున్నాడు. ఇంతలో ఓ పాము అతడి ఫ్యాంటులో దూరింది. వెంటనే అతడు ఏదో దూరిందని గమనించి పైకిలేచి చూశాడు. ప్యాంటు చివర పాము కనిపించడంతో భయంతో ఎటూ కదలకుండా ఓ స్థంబాన్ని ఆసరాగా చేసుకొని రాత్రంతా నిలబడే ఉన్నాడు.
సమాచారం అందుకున్న స్థానికులు బాధితుణ్ని కాపాడే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి పాములు పట్టే అతన్ని సంప్రదించారు. పాములు పట్టేవాళ్లు వచ్చిన తరువాత చాకచక్యంగా పామును బయటకు తీశారు. ఆ పాము అతన్ని కాటు వేయకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.