వణికిస్తున్న చలి పులి

వణికిస్తున్న చలి పులి

తెలంగాణలో చలి చంపేస్తోంది. శీతల గాలుల ధాటికి  ప్రజలు గజ..గజ వణికిపోతున్నారు. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతల భారీగా పడిపోయాయి. తీవ్ర చలి గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో  కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటినా ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చలి మంటలు వేసుకుని సేదతీరుతున్నారు. మరో రెండు రోజులపాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అర్లి-టిలో అత్యల్పంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పిప్పల్ దరిలో 6.3, జైనథ్ లో 6.3, ఆదిలాబాద్ లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురంభీం జిల్లా సిర్పూర్-యూ 5.8, గిన్నెదరిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరిన్ని వార్తల కోసం

కాళేశ్వరం’ అత్యంత పనికిమాలిన ప్రాజెక్ట్