గద్వాల, వెలుగు : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదాములో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు.
రైతులకు నష్టం కలగకుండా చూడాలి..
తుఫాన్ ప్రభావం వల్ల రైతులకు నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. ముంథా తుఫాన్ ప్రభావం వల్ల రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట వర్షానికి తడవకుండా రైతులకు టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
