పట్టణంలో వంద శాతం ట్యాక్స్ వసూలు​ చేయాలి : కలెక్టర్ దీపక్ తివారీ

పట్టణంలో వంద శాతం ట్యాక్స్ వసూలు​ చేయాలి : కలెక్టర్ దీపక్ తివారీ

కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 100 శాతం పన్నులు వసూలుచేయాలని  అడిషనల్​ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. గురువారం కాగజ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ లో మున్సిపల్ కమిషనర్ అంజయ్య తో కలిసి బిల్ కలెక్టర్లు, సూపర్​వైజర్లు, అధికారులతో పన్ను వసూలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఈ క్రమంలో కాగజ్ నగర్ పురపాలక సంఘ పరిధిలో ఆస్తి పన్ను, ఇతర పన్నుల బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేసి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పకడ్బందీగా  నిర్వహించాలని చెప్పారు.   వేసవికాలంలో తగునీటి సమస్య లేకుండా  చర్యలు తీసుకోవాలని సూచించారు.   

 జైనూర్ :   తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో త్వరలో తగిన చర్యలు తీసుకొని పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులను అడిషనల్ కలెక్టర్ దీపక్ తీవారీ ఆదేశించారు.   జైనూర్లోని డబ్బోలి గ్రామంలో పారిశుధ్య పనులను గురువారం తనిఖీ చేశారు.  చెడి పోయిన బోర్ ను పరిశీలించారు.   రానున్న వేసవి కాలంలో తాగు నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను సూచించారు.