ఎమ్మెల్సీ పోలింగ్  కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జి రవినాయక్

ఎమ్మెల్సీ పోలింగ్  కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జి రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఈ నెల 28న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మహబూబ్ నగర్ ఎంపీడీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన పోలింగ్  కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్  జి రవినాయక్  పరిశీలించారు. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  పోలింగ్  కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో మార్క్  చేసి  బారికేడింగ్  ఏర్పాటు చేయాలని సూచించారు.

పోలింగ్ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్  కలెక్టర్  శివేంద్రప్రతాప్, జడ్పీ సీఈవో రాఘవేంద్రరావు, ఆర్డీవో నవీన్  ఉన్నారు.