
యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో డ్యూటీకి డుమ్మా కొట్టిన యాదగిరిగుట్ట పీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్కు డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాదగిరిగుట్ట పీహెచ్సీ, భువనగిరిలోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుట్టలోని పీహెచ్సీలోని ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు.
అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి ఎంత మంది సిబ్బంది విధులకు హాజరయ్యారో అడిగి తెలుసుకున్నారు. భువనగిరిలోపి హాస్టల్స్‌ను సందర్శించిన ఆయన వంట సరుకులను పరిశీలించారు. స్టూడెంట్స్‌తో మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు.