డ్యూటీకి హాజరుకాని డాక్టర్లకు నోటీసులివ్వాలి .. కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం

డ్యూటీకి హాజరుకాని డాక్టర్లకు నోటీసులివ్వాలి .. కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం

జైపూర్, వెలుగు: జైపూర్ తోపాటు కుందారం పీహెచ్ సీ, పల్లె దవాఖానాలను కలెక్టర్ ​కుమార్​దీపక్​ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైపూర్​ పీహెచ్​సీతో పాటు గంగిపల్లిలోని పల్లె దవాఖానాల్లో  విధులకు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ​ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీకి రాని డాక్టర్లు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

 పీహెచ్​సీలకు వచ్చే ప్రజలకు డాక్టర్లు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. విధుల్లో సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.గంగిపల్లిలో నిర్మి స్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. మండల కేంద్రంలోని కేజీబీవీతో పాటు గురుకుల బాలుర స్కూల్​ను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సత్యనారాయణ, సంబంధిత అధికారులున్నారు.

విద్యారంగం బలోపేతానికి చర్యలు

నస్పూర్, వెలుగు: విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ అన్నారు. మంచిర్యాల రాజీవ్ నగర్​లోని కేజీబీవీని సందర్శించి క్లాస్​రూమ్స్, కిచెన్, టాయ్​లెట్లు, ఆహారం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. స్థానిక పీహెచ్​సీని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి డాక్టర్లు, సిబ్బందికి సూచనలు చేశారు.