కౌంటింగ్ పక్కాగా నిర్వహించాలి :  కలెక్టర్  కుమార్ దీపక్

కౌంటింగ్ పక్కాగా నిర్వహించాలి :  కలెక్టర్  కుమార్ దీపక్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్  కలెక్టర్  కుమార్ దీపక్  సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్  హాల్​లో కౌంటింగ్  అసిస్టెంట్​ సూపర్​వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల కౌంటింగ్  కోసం కేటాయించిన సిబ్బంది నిష్పక్ష పాతంగా పని చేయాలన్నారు.

నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. బ్యాంకు సిబ్బంది మాత్రమే మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. నోడల్  ఆఫీసర్​ నర్సింగ్ రావు, ఎల్డీఎం కౌశల్ కిశోర్ పాండే పాల్గొన్నారు.