ఏపీ ప్రభుత్వం తరఫున.. జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు

ఏపీ ప్రభుత్వం తరఫున.. జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు

అలంపూర్, వెలుగు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి సమర్పించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్​కు ఈవో దీప్తి, అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. అనంతరం కలెక్టర్​ను సత్కరించి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిరి మాట్లాడుతూ అమ్మవారికి, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కలెక్టర్​ వెంట కర్నూల్ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుధాకర్ రెడ్డి ఉన్నారు.