పారదర్శకంగా పత్తి కొనుగోలు జరపాలి : కలెక్టర్ విజయేందిర బోయి

పారదర్శకంగా పత్తి కొనుగోలు జరపాలి : కలెక్టర్ విజయేందిర బోయి
  • కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సీసీఐ పత్తి కొనుగోలు జరపాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులకు సూచించారు. మంగళవారం మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, మహబూబ్​నగర్ రూరల్ మండలం అపాయపల్లి గ్రామంలోని బాలాజీ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లును ఆమె సందర్శించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మక్కలు ఎండబెట్టి తీసుకొని వస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ చేసుకొని వస్తే పత్తి కొనుగోలు చేస్తారని తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా బుధ, గురువారాల్లో వర్షం పడే అవకాశం ఉన్నందున, రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలని సూచించారు. 

నిజాయితీగా పాలన అందించాలి..

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ప్రతి ఉద్యోగి నిజాయితీగా ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. కలెక్టరేట్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజిలెన్స్ అందరి బాధ్యతని ప్రతి ఉద్యోగి గుర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ప్రాంతీయ విజిలెన్స్, ఎన్​ఫోర్స్ మెంట్ అధికారి డి.ఆనంద్ కుమార్,  హైదరాబాద్ సిటీ –2 యూనిట్, విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో నవీన్, అధికారులు పాల్గొన్నారు.