PAN Card Misused: కాలేజీ స్టూడెంట్కు రూ.46 కోట్ల ఇన్కంట్యాక్స్

PAN Card Misused: కాలేజీ స్టూడెంట్కు రూ.46 కోట్ల ఇన్కంట్యాక్స్

PAN Card Misused: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.లేటెస్ట్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆధార్ కార్డులు, బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు, పాన్ కార్డులను క్లోనింగ్ చేయడం ద్వారా వ్యక్తుల పర్సనల్, ఫైనాన్షియల్ డేటాను  దొంగిలించి ఖాతాలు ఖాళీ చేసిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చూశాం. తాజాగా  ఓ స్టూడెంట్కు చెందిన పాన్ కార్డును మిస్ యూజ్ చేయడం ద్వారా మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. 

మధ్యప్రదేశ్ కు చెందిన స్టూడెంట్ ప్రమోద్ కుమార్ (25).. ఇన్కంట్యాక్స్ డిపార్టెమెంట్ నుంచి నోటీసులు చూసి షాక్ తిన్నాడు.. నోటీసులో తాను 46 కోట్లి జీఎస్టీ, ఇన్ కంట్యాక్స్ చెల్లించాలని ఉంది.  ప్రమోద్ కుమార్ పాన్ తో తన పేరిట ఓ పెద్ద కంపెనీ ఉన్నట్లు.. ప్రమోద్ కుమార్  పేరిట 2021లో ముంబై, ఢిల్లీలో స్థాపించినట్లు.. దానికి సంబంధించి ఇన్ కంటాక్స్ పే చేయాలని నోటీసులు పేర్కొన్నారు అధికారులు.  

దీంతో ప్రమోద్ కుమార్ ఆందోళన చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కాలేజీ స్టూడెంట్ ను..  నాకు ఎలాంటి కంపెనీలు లేదు.. నాపేరుతో ఢిల్లీ, ముంబైలో కంపెనీ ఉందంటున్నారు.. నా పాన్ దుర్వినియోగం చేయబడింది. బ్యాంకు ఖాతానుంచి రూ. 46 కోట్లు లావాదేవీలు జరిగాయని ’’ తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు ప్రమోద్ కుమార్. 

పాన్ కార్డు మోసాలను ఎలా గుర్తించాలి? ఎలా అడ్డుకోవాలి ? 

  • పాన్ కార్డు మోసాలను అడ్డుకోవాలంటే.. 
  • క్రెడిట్ బ్యూరో వెబ్ సైట్ ల ద్వారా క్రమం తప్పకుండా తమ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసుకోవాలి. 
  • తమ బ్యాంకు ఖాతానుంచి ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగాయా చెక్ చేసుకోవాలి. 
  • అనుమానాస్పద వెబ్ సైట్లలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదు. 
  • ఫారమ్ 26AS  ట్రాకింగ్  చేయడం ద్వారా పాన్ కార్డు లింకింగ్ మోసపూరిత లావాదేవీలను గుర్తించడానికి మరో మార్గం . 

సో.. పై జాగ్రత్తలు పాటించడం ద్వారా పాన్ కార్డు మిస్ యూజ్ కాకుండా చెక్ పెట్టొచ్చు.