ఎన్నికలయ్యాక బీజేపీలో బీఆర్​ఎస్ విలీనం

ఎన్నికలయ్యాక బీజేపీలో బీఆర్​ఎస్ విలీనం
  • పీసీసీ జనరల్ సెక్రటరీ పున్న కైలాస్ ​నేత కామెంట్

హైదరాబాద్, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్ హోల్​సేల్​గా బీఆర్ఎస్​ను బీజేపీకి అమ్మకానికి పెట్టారని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను నిలుపుతున్నారని పీసీసీ జనరల్ సెక్రటరీ పున్న కైలాస్​ నేత ఆరోపించారు. ఎన్నికల తర్వాత బీఆర్ ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ ఎస్ ప్రవీణ్ ను బీఆర్ ఎస్ పెంచి పోషించిందని

పొత్తుతో ముసుగు తొలిగిందని అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. కేటీఆర్ నైరాశ్యంతో కనపడుతున్నారని, ఎర్రగడ్డ లో కూర్చుని సీఎం కుర్చీ కోసం కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్​కు మతి తప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఏక్ నాథ్​ షిండే అని అంటున్నారని ఫైర్ అయ్యారు.