హాస్పిటల్ ఖర్చులపై సామాన్యునికి తప్పని తిప్పలు

హాస్పిటల్ ఖర్చులపై సామాన్యునికి తప్పని తిప్పలు
  • 2017–18లో 2,652 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రజలు
  • జనం ఖర్చు 90%.. రాష్ట్ర సర్కార్ ఖర్చు 10%
  • కరోనా తర్వాత మరింత పెరిగిన భారం
  • ఒక్కో వ్యక్తి ఏటా దవాఖాన్లకు పెడ్తున్నది రూ. 26 వేలు
  • కేంద్రం ప్రకటించిన హెల్త్ అకౌంట్స్ వివరాల్లో వెల్లడి

6 వేల కోట్లు మించని రాష్ట్ర హెల్త్ బడ్జెట్

మన రాష్ట్ర సర్కార్ ఆరోగ్య రంగం కోసం బడ్జెట్లో కేటాయిస్తున్న మొత్తం రూ.6 వేల కోట్లకు మించి ఉండడం లేదు. కొత్త మెడికల్ కాలేజీలు, దవాఖాన్ల నిర్మాణం నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం బడ్జెట్ లో రూ.11,237 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్మాణ ఖర్చులు, ఆరోగ్యశాఖ ఉద్యోగుల జీతాలకే రూ.8 వేల కోట్లు పోతాయి. ప్రజలకు ఇచ్చే ట్రీట్మెంట్కు పెట్టేది. రూ.3 వేల కోట్లు మాత్రమే.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హాస్పిటల్ ఖర్చుల కోసం ఎన్నో కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. లక్షల మంది పేదలు తలకు మించిన భారం మోస్తున్నారు. ఏటా తమ సంపాదనలో అధిక భాగాన్ని ట్రీట్మెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారు. భారీగా పెరిగిన ట్రీట్మెంట్ బిల్లు చెల్లించేందుకు కొందరు తమ ఆస్తుల ను అమ్ముకుంటుంటే.. ఇంకెందరో అప్పుల పాలు అవుతున్నారు. రాష్ట్రంలో మందులు కొనుగోలు కోసం అయ్యే ఖర్చులో 90 శాతా నికిపైగా తమ జేబు నుంచే జనాలు పెట్టుకుం టున్నారు. వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిం వత్సరంలో రూ. 500 కోట్లు కేటాయించింది. చాల్సిన ప్రభుత్వం.. మందులకయ్యే ఖర్చులో పట్టుమని పది శాతం కూడా భరించడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెం టులో వెల్లడించిన నేషనల్ హెల్త్ అకౌంట్స్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో జనాలు ఒక్క మందుల కొనుగోలు కోసమే రూ.2,652 కోట్లు ఖర్చు చేశారు. అదే ఏడాది మన సర్కార్ మందుల కొనుగోలు కోసం చేసిన ఖర్చు రూ.251 కోట్లు మాత్రమే. ఇప్పటికీ మందుల కోసం సర్కార్ చేస్తున్న ఖర్చులో పెద్దగా మార్చేమీ రాలేదు. గతేడాది మెడిసిన్ కొనుగోలు కోసం రూ.330 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు కేటాయించింది. మరోవైపు జనాలు మందుల కోసం పెట్టే ఖర్చు ఈ మూడేండ్లలో నాలుగైదు రెట్లు పెరిగి ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం కరోనా అని చెబుతున్నారు. రోగులు ఆస్పత్రుల పాలై.. డాక్టర్ల ఫీజులు, ల్యాబ్ టెస్టులు, బెడ్, నర్సింగ్, డిస్పోజబుల్స్ చార్జీలు.. ఇలా పెట్టుకున్న ఎన్నో ఖర్చుల్లో మందులు ఒక భాగం మాత్రమే.

క్యాన్సర్, టీబీ పేషెంట్లలో 90 శాతం పేదలే

క్యాన్సర్, టీబీ, కిడ్నీ పేషెంట్లలో దాదాపు 80 నుంచి 90 శాతం మంది పేద, మధ్యతరగతి జనాలే ఉంటున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్‌‌మెంట్ సకాలంలో అందదనో, వాటిపై నమ్మకం లేకనో 76 శాతం మంది రోగులు ప్రైవేటు హాస్పిటళ్లనే ఆశ్రయిస్తున్నారు. చార్జీల కోసం అందినకాడికి అప్పులు చేస్తున్నారు.. లేదా ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఖర్చులు భరించలేక మధ్యలోనే మందుల వాడకం బంద్‌‌పెట్టి, రోగం ముదిరి ప్రాణాలు కోల్పోతున్న వాళ్లెందరో ఉన్నారు. ఒక్క టీబీతోనే మన రాష్ట్రంలో ఏటా సగటున 2,200 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవానికి సరిగ్గా మందులు వాడితే టీబీ ప్రాణాంతక జబ్బేమీ కాదు. అయినా మందుల ఖర్చులు భరించలేక ఇంత మంది చనిపోతున్నారు. బీపీ, షుగర్ రోగాలు ప్రతి ఇంటినీ చుట్టుముడుతున్నాయి. ఈ జబ్బులు ఒక్కసారి వచ్చాయంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా మందులు అందజేస్తున్నామని చెప్పడమే తప్పితే.. గ్రౌండ్‌‌ లెవల్‌‌లో పరిస్థితి భిన్నంగా ఉంటున్నది. నాణ్యమైన మందులు ఇవ్వడం లేదని, డాక్టర్లు సూచించిన ప్రకారం ఇవ్వడం లేదని చాలా మంది సర్కారీ మందులను వాడడం లేదు. ప్రాణాలతో చెలగాటం ఎందుకన్న భయంతో సొంత ఖర్చులతో ప్రైవేటుగానే మందుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. రోగం ముదురుతున్నకొద్దీ మందులకయ్యే ఖర్చు కూడా పెరుగుతున్నది. డయాబెటిస్‌‌తో కొత్త రోగాలు ఉత్పన్నమై నెలవారీ సంపాదనలో సగం మొత్తాన్ని మందులే తినేస్తున్నయి.

దవాఖానలో అడ్మిట్ అయితే...

మందుల ఖర్చులే కాదు... డాక్టర్ ఫీజు, బెడ్ చార్జీలు కూడా అడ్డగోలుగా పెరిగాయి. కరోనాకు ముందు కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్ శ్రీ కన్సల్టేషన్ సగటున రూ.600 ఉంటే, ఇప్పుడు ఏకంగా వెయ్యికి చేరింది. ప్రైవేటు హాస్పిటల్ లో రూ.500 నుంచి 800 చార్జ్ చేస్తున్నారు. చిన్న హాస్పిటల్స్ లో 300మంచి 600 తీసుకుంటున్నారు. జ్వరం వచ్చి ప్రైవేటు దవాఖానలో నాలుగైదు రోజులు అడ్మిటై ఉంటే తక్కువలో తక్కువ రూ. వేల బిల్లు వేస్తున్నారు. ప్లేట్లెట్స్ పడిపోవడం వంటి -సమస్యలు తలెత్తితే అదనంగా ఇంకో 25 వేలు గుంజుతున్నారు. లక్షల్లో చార్జ్ చేస్తున్న దవాఖాన్లు కూడా ఉన్నాయి. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో నివసించే ఒక్కో ఆ వ్యక్తి తన సంపాదనలో సగటున ఏడాదికి రూ.25 వేలు దవాఖాన ఖర్చులకు వెచ్చిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో ఈ ఖర్చు రూ.14 వేలకుపైగా ఉంది. జనాలు దవాఖాన్లకు ఏటా సుమారు 50 వేల కోట్లకుపైనే సమర్పిస్తున్నట్టు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.