ఈ ఏడాది రికార్డ్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో శాలరీ హైక్‌‌‌‌లు!

ఈ ఏడాది రికార్డ్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో శాలరీ హైక్‌‌‌‌లు!

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఉద్యోగుల శాలరీని ఈ ఏడాది 9.9 శాతం వరకు  పెంచడానికి కంపెనీలు రెడీగా ఉన్నాయని ఓ సర్వే ద్వారా తెలిసింది.  కంపెనీలు కొత్త తరం టెక్నాలజీలలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయని, దీంతో టాలెంట్ ఉన్న  ఉద్యోగులకు శాలరీలు పెంచడానికైనా సిద్ధంగా ఉన్నాయని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌‌‌‌ కంపెనీ ఏయాన్స్‌‌‌‌ హ్యూమన్ క్యాపిటల్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ ఓ  సర్వేలో వెల్లడించింది. ఎకానమీ వేగంగా రికవరీ అవుతుండడం, వ్యవస్థలో బిజినెస్ సెంటిమెంట్ పాజిటివ్‌‌‌‌గా ఉండడం వంటి అంశాలు శాలరీ ఇంక్రిమెంట్‌‌‌‌లకు సాయపడుతున్నాయని తెలిపింది. కాగా, గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే ఎక్కువగా ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపింది. 2021 లో సగటున 9.3 శాతం శాలరీ హైక్‌‌‌‌ను కంపెనీలు చేపట్టాయి.  మొత్తం 40 సెక్టార్లకు చెందిన 1,50‌‌‌‌‌‌‌‌0 కంపెనీల నుంచి డేటాను సేకరించి ఈ సర్వేను ఏయాన్‌‌‌‌ విడుదల చేసింది. 

ఈ సెక్టార్లలో శాలరీలు ఎక్కువగా పెరుగుతాయ్‌‌‌‌.. 

ఈ–కామర్స్‌‌‌‌, వెంచర్ క్యాపిటల్‌‌‌‌, హైటెక్‌‌‌‌ లేదా ఐటీ, ఐటీ రిలేటెడ్  సర్వీస్‌‌‌‌లు, లైఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌ సెక్టార్లలో శాలరీ హైక్‌‌‌‌లు ఎక్కువగా ఉంటాయని ఈ సర్వే అంచనావేసింది. 2021 లో అట్రిషన్‌‌‌‌ రేటు (జాబ్ మానేయడం) గరిష్టంగా 21 శాతంగా నమోదయ్యిందని సర్వేలో పాల్గొన్న కంపెనీలు పేర్కొన్నాయి.  గత పదేళ్లలో ఇదే ఎక్కువ అని ఈ సర్వే వివరించింది. దీనినిబట్టి దేశంలోనూ యూఎస్‌‌‌‌ గ్రేట్ రిజిగ్నేషన్‌‌‌‌ ప్రభావం కనిపిస్తోందని వెల్లడించింది. 

గ్రోత్‌‌‌‌ ఉంటుంది.

ఏయాన్‌‌‌‌ సర్వే ప్రకారం, ఈ ఏడాది బిజినెస్‌‌‌‌ పరిస్థితులు మెరుగుపడతాయని 88 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. 11 శాతం కంపెనీలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపాయి.  కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది  ఐదు శాతం ఎక్కువగా శాలరీని పెంచుతామని 33 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.  దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని, బిజినెస్ సెంటిమెంట్‌‌‌‌ పాజిటివ్‌‌‌‌గా ఉంటుందని ఏయాన్స్‌‌‌‌ పార్టనర్ రూపాంక్‌‌‌‌ చౌదరి అభిప్రాయపడ్డారు. కరోనా ఫస్ట్ వేవ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ఎక్కువగా నష్టపోయిన రిటైల్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు ప్రస్తుతం రికవరీ అయ్యాయని చెప్పారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సేల్స్‌‌‌‌పై దృష్టి పెడుతున్నాయని, అందుకే 8 శాతం కంటే ఎక్కువ శాలరీ హైక్‌‌‌‌ను ఇవ్వాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తొలగకపోవడం, ఇన్‌‌‌‌ఫ్లేషన్ భయాలు ఉండడంతో  శాలరీలు పెంచేందుకు కొందరు వెనుకాడుతున్నారని రూపాంక్ అన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, మిగిలిన  బ్రిక్స్ (బ్రెజిల్‌‌‌‌, రష్యా, ఇండియా, చైనా) దేశాల కంటే ఇండియాలో ఈ ఏడాది శాలరీ హైక్‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయని ఏయాన్స్‌‌‌‌ సర్వే వెల్లడించింది.

ఉద్యోగులకు రిలీఫ్‌‌‌‌‌‌‌‌..

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో శాలరీలు పెరిగితే  ఉద్యోగులకు కొంత రిలీఫ్‌‌‌‌గా ఉంటుందని ఏయాన్ హ్యూమన్‌‌‌‌ క్యాపిటల్ సొల్యూషన్స్‌‌‌‌ సీఈఓ నితిన్ సెతి అన్నారు. మరోవైపు కంపెనీలు ఇప్పటికే రికార్డ్‌‌‌‌ లెవెల్‌‌‌‌ అట్రిషన్‌‌‌‌ రేటుతో ఇబ్బందిపడుతున్నాయని, ఇప్పుడు ఉద్యోగుల ఖర్చు పెరగడం కూడా వీటిపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఎకానమీ రికవరీ అవుతుండడంతో కొత్త తరం టెక్నాలజీలను హ్యాండిల్ చేసే వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను రెడీ చేయాల్సిన అవసరం కంపెనీలపై పడిందని  ఆయన అభిప్రాయపడ్డారు. బిజినెస్‌‌‌‌ల అవుట్‌‌‌‌లుక్ బాగుండడంతో డబుల్ డిజిట్‌‌‌‌లోశాలరీల పెరుగుదలను చూడొచ్చని అంచనావేశారు.