తెలుగు భాషపై స్టూడెంట్స్​కు పోటీలు

తెలుగు భాషపై స్టూడెంట్స్​కు పోటీలు

భద్రాచలం, వెలుగు :  తెలుగు భాష ఔన్నత్యం కాపాడటానికి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో వినూత్నంగా ఐటీడీఏ పీవో బి.రాహుల్ బాలబాలికలకు పలు పోటీలు నిర్వహించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక గురుకుల విద్యాలయంలో తెలుగులో కవితలు, శీర్షికలు, పద్యాలు, ఒక నిముషం పాటు తెలుగులో మాట్లాడటం, ఏకపాత్రాభినయం, క్విజ్​ పోటీలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలుగుతనం ఉట్టిపడేలా సాగిన ఈ సాంస్కృతిక పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గెలిచిన బాలబాలికలకు పీవో రాహుల్ ప్రైజ్​లు అందజేశారు. తెలుగు భాష గొప్పదని, ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి వెలుగులోకి వస్తుందని పీవో అన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ మణెమ్మ, గురుకులాల ఆర్సీవో నాగార్జున  తదితరులు పాల్గొన్నారు.