పోటీతత్వం చాలా ముఖ్యం : మంత్రి కేటీఆర్

పోటీతత్వం చాలా ముఖ్యం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్​, వెలుగు: మనందరి జీవితాల్లో సమస్యల పరిష్కారానికి ఇన్నోవేషన్లు, పోటీతత్వం చాలా ముఖ్యమని, వీటివల్లే  అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్​, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. ఏదైనా కొత్తదాన్ని కనిపెట్టడం అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడుతుందని కామెంట్​చేశారు. హైదరాబాద్​లో సోమవారం నిర్వహించిన ‘టై (ది ఇండస్ ఎంటర్‌‌ప్రైజెస్‌)  గ్లోబల్​సమిట్’ లో ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్ల కోసం తమ ప్రభుత్వం బలమైన ఇన్నోవేషన్​ ఎకోసిస్టమ్​ను నిర్మించిందని చెప్పారు. ఎంట్రప్రెనూర్లు సంపదను సృష్టించగలుగుతారు కాబట్టి వారికి ఎన్నో విధాల సాయపడుతున్నామని అన్నారు.  1992లో ప్రారంభమైన  ‘టై’ ఎంట్రప్రినూర్ల కోసం ఎంతో మేలు చేసిందని ప్రశంసించారు. తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌‌తో కలిసి చురుగ్గా పనిచేసిందని అన్నారు.  వీరికి నాణ్యమైన క్లాస్​ అడ్వైజరీ సర్వీసులు, వనరులను అందించిందని పేర్కొన్నారు. మెంటర్​షిప్​, విద్య, టెక్​, ప్రొడక్ట్​ సపోర్ట్​, విస్తరణ, బిజినెస్​ నెట్‌‌వర్క్, ఫైనాన్సింగ్, మార్కెట్లు,  మీడియా యాక్సెస్​, వెంచర్ క్యాపిటల్,  ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారుల నుంచి సాయం అందేలా చేయడం వంటి విషయాల్లో ఎంతో సహకారం అందించిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం..  టీహబ్​,  వీ హబ్​, టీఎస్​ఐసీ, రిచ్​, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి ద్వారా టై వంటి సంస్థలకు మద్దతునిస్తూనే ఉంటుందన్నారు.  ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ జీఎస్​డీపీ 130 శాతం, ఐటీ ఎక్స్​పోర్టులు 250 శాతం, వ్యవసాయ కార్యకలాపాలు 190 శాతం, పచ్చదనం 31.7 శాతం పెరిగాయన్నారు. ‘‘ ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సిన్లు తయారవుతున్నది కూడా హైదరాబాద్​లోనే! వచ్చే ఏడాది 14 బిలియన్ల వ్యాక్సిన్లు తయారవుతాయని అంచనా. మన  సిటీ  ఐటీ, ఫార్మా హబ్​ కావడం, అన్ని రకాల సదుపాయాలు ఉండటం వల్ల ఎన్నో గ్లోబల్​ కంపెనీలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్​ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి”అని మంత్రి వివరించారు. 

స్టార్టప్​ల కోసం ఎంతో చేశాం...

తమ ప్రభుత్వం స్టార్టప్​లకు ఎంతో చేయూతను ఇచ్చిందని వివరించారు. ‘‘తెలంగాణ స్టార్టప్​ల రాష్ట్రం.   టీహబ్, టీవర్క్స్​, వీ హబ్​, టీఎస్​ఐసీ, రిచ్​, టాస్క్​, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇమేజ్​, ఎన్​ఏసీఏఎంలతో భారత దేశపు ప్రముఖ ఇన్నోవేషన్ నెట్‌‌వర్క్​వను నిర్మించినందుకు మేం గర్విస్తున్నాం.  ఈ ఏడాది జూన్ 28 న టీహబ్​ 2.0 ను కూడా మొదలుపెట్టాం. 2.1 మిలియన్ చదరపు అడుగుల జాగాలో ఏర్పాటైన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ స్పేస్‌‌. టీహబ్​ తన ఏడు సంవత్సరాల ప్రయాణంలో 1,100 మంది ఎంటర్​ప్రైనూర్లకు సాయపడింది. 1.9 బిలియన్​ డాలర్లు సేకరించడంలో వారికి సహకారం అందించింది. స్టార్టప్ జీనోమ్ రిపోర్ట్ ప్రకారం తక్కువ ధరల్లో ట్యాలెంట్​ అందుబాటులో ఉన్న టాప్​–10  సిటీల్లో హైదరాబాద్​ ఒకటి. ‘టాప్​–15 ఇన్​ ఏషియన్​ ఎకోసిస్టమ్​ ఫర్​ ఫండింగ్​’ ఇండెక్స్​లో మన సిటీ కూడా ఉంది. ‘టాప్ 15 బ్యాంగ్ ఫర్ బక్ కేటగిరీలో గ్లోబల్ ఎకోసిస్టమ్‌‌లో టాప్ 15’లో ఉన్నాం. రాష్ట్రంలో బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌ను అభివృద్ధి చేయడంలో తెలంగాణ చాలా బాగా పనిచేసిందని డీపీఐఐటీ గుర్తించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్టులో  తెలంగాణ ‘టాప్–​‌‌‌‌10’లో ఉంది.   తెలంగాణలో 50కిపైగా రంగాలకు చెందిన ,6500 స్టార్టప్‌‌లు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి స్పేస్ స్టార్టప్- స్క్రైరూట్​ టీహబ్​ లో ఇంక్యుబేట్ అయింది. డార్విన్‌‌బాక్స్ ఈ సంవత్సరంలో యునికార్న్‌‌గా మారింది. హెచ్​ఆర్​ టెక్​ సంస్థ ‘కేక’ ఇటీవలే 57 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ అందుకుంది.  భారతదేశపు అతిపెద్ద సిరీస్ ఏ ‘సాస్​’ నిధులను పొందిన సంస్థగా గుర్తింపు సాధించింది”అని అన్నారు.