పునరావాస గృహాల వద్ద మైసంపేట వాసుల ఆందోళన

పునరావాస గృహాల వద్ద  మైసంపేట వాసుల ఆందోళన
  • తేల్చి చెప్పిన నిర్మల్​ జిల్లా
  • కవ్వాల్​ టైగర్​ జోన్ నిర్వాసితులు
  • కొత్తమద్దిపడగ శివారులో
  • 92 ఇండ్లు కట్టిస్తున్న సర్కారు

కడెం, వెలుగు : పునరావాస కేంద్రాల్లో కట్టిన ఇండ్లలో నాణ్యత లేదని, నిర్మించకముందే పగుళ్లు ఏర్పడ్డాయని కవ్వాల్ ​టైగర్ ​జోన్ ​పునరావాస బాధితులు మంగళవారం ఆ ఇండ్ల దగ్గర నిరసన తెలిపారు. నాణ్యంగా నిర్మిస్తేనే వచ్చి ఉంటామని, లేకపోతే వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు నేపథ్యంలో టైగర్లు తిరిగే ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట,  రాంపూర్ గ్రామస్తుల కోసం మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో 94 ఇండ్లను నిర్మిస్తోంది. అయితే, ఈ ఇండ్ల నిర్మాణం పూర్తికాకముందే అక్కడక్కడా పగుళ్లు తేలాయని, కాంట్రాక్టర్​ నాసిరకంగా నిర్మిస్తున్నాడని మైసంపేట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు.

పునరావాస గృహాల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోందని..తక్కువ సిమెంట్​తో ఇండ్లకు ప్లాస్టింగ్ చేశారని, సెప్టిక్ ట్యాంక్, సీసీ రోడ్ల నిర్మాణం కూడా నాసిరకంగా ఉందని ఆరోపించారు. కాంట్రాక్టర్ బిల్లులను వెంటనే నిలిపివేయాలని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండ్లు క్వాలిటీగా కడితేనే వచ్చి ఉంటామని, లేకపోతే పాత చోటే ఉంటామని తేల్చి చెప్పారు.