పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కరించాలి: దొంత నరేందర్

పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కరించాలి:  దొంత నరేందర్

మెదక్​ టౌన్​, వెలుగు :  ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యలతోపాటు సీపీఎస్​ను రద్దు చేసి జులై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రతినెలా 1న జీతాలు రాకపోవడం, సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్​మెంట్స్​ బిల్లుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జీవో నంబర్ 79 విడుదల చేసిన క్రమంలో కలెక్టర్ యుద్ధ ప్రతిపాదికన కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.

ALSO READ :వరదలోనే వరంగల్.. నీట మునిగిన 150 కాలనీలు

ఈ సమస్యలపై జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్ తీర్మానాలు  ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించారు‌. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, జిల్లా కోశాధికారి బట్టి రమేశ్, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఎండి ఇక్బాల్ బాషా, అర్షద్, ఫజలుద్దీన్, సంయుక్త కార్యదర్శి రాధా, కార్యనిర్వాహ కార్యదర్శి చిరంజీవ ఆచార్యులు, కార్యవర్గ సభ్యులు లీల, విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ యూనిట్ అధ్యక్షులు శివాజీ, ఏడుపాయల వనదుర్గ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్య శ్రీనివాస్, ప్రశాంత్, ఆయా యూనిట్ల  అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.