మహిళ డెడ్​బాడీతో ఆందోళన

మహిళ డెడ్​బాడీతో ఆందోళన

అచ్చంపేట, వెలుగు: ప్రైవేట్​ హాస్పిటల్​ డాక్టర్​ నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ శనివారం రాత్రి మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అమ్రాబాద్​ మండలం మన్ననూర్​ గ్రామానికి చెందిన కల్పన(30) డెలివరీ కోసం అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ఈ నెల 21న చేరింది. మహిళకు సిజేరియన్​ చేయగా, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు బ్లీడింగ్​ ఆగక పోవడంతో పరిస్థితి విషమించింది. 

దీంతో ఆమెను జిల్లా హాస్పిటల్​కు రెఫర్​ చేశాడు. అక్కడి నుంచి శనివారం రాత్రి హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. కల్పన మృతికి ప్రైవేట్​ హాస్పిటల్​ డాక్టరే కారణమని ఆరోపిస్తూ శనివారం రాత్రి డెడ్ బాడీనీ అచ్చంపేటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా, ఎన్నికల కోడ్​ ఉందని ధర్నా చేయవద్దని హైదరాబాద్​ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు డెడ్​బాడీతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు.