అరెస్టు చేసిన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలి

అరెస్టు చేసిన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలి
  • పీఆర్సీ సాధన సమితి నేత, ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

అమరావతి: ఛలో విజయవాడ నిరసన కార్యక్రమానికి హాజరైనా.. వచ్చేందుకు ప్రయత్నించిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులను అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పీఆర్సీ సాధన సమితి నేత, ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దారుణంగా అణచివేయాలని ప్రయత్నించినా.. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనను విజయవంతం చేశారని అన్నారు. ఇవాళ జరిగిన పరిణామాలపై రేపు స్టీరింగ్ కమిటీలో చర్చించి కార్యాచరణ నిర్ణయించుకుంటామన్నారు. ఛలో విజయవాడ నిరసన సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బాగా కంట్రోల్ చేశారని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా.. వద్దా అనేది రేపు స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 


ఈనెల 5వ తేదీ నుంచే సహాయ నిరాకరణ ఉద్యమం
ఏపీ పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. మా సమ్మె వల్ల ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా.. ప్రభుత్వానిదే బాధ్యత అని.. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారని బొప్పరాజు వెల్లడించారు. ఉద్యోగుల ఉద్యమం .. సంఘటిత శక్తి స్థాయి అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసివచ్చేలా ఆందోళనలు కొనసాగుతాయని..  చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదని విమర్శించడం తగదన్నారు. ఉద్యోగ సంఘాల వెనుక ఎవరో ఉండి చేయిస్తున్నారని పిచ్చిపిచ్చి ఆరోపణలు చేయిస్తున్నారని.. అయితే తమ వెనుక లక్షలాదిగా ఉద్యోగులుండి తమను వెన్ను తట్టి పంపుతున్నారని తెలిపారు. చర్చలకు పిలిచి అర్థరాత్రి 12 గంటల వరకు సచివాలయంలో పడిగాపులు కాసేలా చేయించి అవమానం చేశారని ఆరోపించారు. పీఆర్సీని మోసపూరితంగా ప్రకటించడం ఒక చరిత్ర.. వ్యతిరేకిస్తూ చేస్తున్న ఈ ఉద్యమం కూడా చరిత్రేనని అయన పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి..

ఏపీలో ఇవాళ కొత్త కేసులు 4,605 మరణాలు 10

ఉద్యోగులు అన్న ఆ మాటతోనే వెనుకడుగేశా

నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందే