సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలకు క్షీరాభిషేకం 

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలకు క్షీరాభిషేకం 

వెలుగు, నెట్​వర్క్​ : రాష్ట్ర చరిత్రలో ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనికే దక్కనుందని పలువురు పార్టీ నేతలు అన్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయం తీసుకోవడంతో ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోలకు కాంగ్రెస్​ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఖమ్మంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జూలూరుపాడులో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మధిరలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిర్యాల రమణగుప్త, కామేపల్లిలో  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, గుండాలలో మండల అధ్యక్షుడు కోడెం ముత్యమాచారి మాట్లాడారు.

కాంగ్రెస్​ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు  ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు రైతుల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బడుగు,బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే అది ఇందిరమ్మ రాజ్యం వల్లే సాధ్యమన్నారు. కేసీఆర్​ మాయ మాటలు చెప్పి లక్ష రుపాయలు కూడా రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు