కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌‌ ఎన్నికను రద్దు చేయాలి

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌‌ ఎన్నికను రద్దు చేయాలి

మెట్ పల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ వల్ల గెలిచిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌‌ ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.  మంగళవారం జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో   సంజయ్‌‌ను గెలిపించడానికి అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్,  హరీశ్‌‌రావు కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి నర్సింగరావు ఫోన్ ట్యాప్ చేయించి, ఆయనతో టచ్‌‌లో ఉన్న లీడర్లను బెదిరించారని ఆరోపించారు. 

అనంతరం ఆర్డీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరు మహేంద్ర రెడ్డి, మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కౌన్సిలర్లు యమ రాజయ్య, మర్రి సహదేవ్, కోఆప్షన్  మెంబర్ మార్గం గంగాధర్, లీడర్లు పాల్గొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను శిక్షించాలి

కోరుట్ల, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్‌‌ చేశారు. మంగళవారం కోరుట్ల లోని జువ్వాడి భవన్​లో కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ తిరుమల గంగాధర్​ అధ్యక్షతన మీడియా సమావేశంలో కోరుట్ల టౌన్​, మండల, బ్లాక్​ అధ్యక్షులు​తిరుమల గంగాధర్, కొంతం రాజం, పెరుమాండ్ల సత్యనారాయణ , మాజీ మున్సిపల్ చైర్మన్​ శీలం వేణుగోపాల్​ పాల్గొని మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్‌‌తో జువ్వాడిని ఓడించారు

మల్లాపూర్ , వెలుగు: న్యాయబద్ధంగా గెలవలేక జువ్వాడి నర్సింగరావు ఫోన్​ను ట్యాపింగ్ చేసి ఓడించారని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలాల జలపతి రెడ్డి ఆరోపించారు. మంగళవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్‌‌కు వస్తున్న ఆదరణను చూసి నాటి బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం.. కాంగ్రెస్‌‌ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్​ చేయించిందన్నారు. 

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌‌ను గెలిపించేందుకు నాటి ప్రభుత్వ పెద్దలు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేయించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస్ , లీడర్లు బాపురెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ రఫీ, నూతిపెల్లి రాజం, తోట సంతోష్ పాల్గొన్నారు.