
హుజురాబాద్ బై ఎలక్షన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ప్యాట రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్‌గా బెల్మూరి వెంకట్‌ను ఎంపిక చేయడం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాదని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలా ఉందని ఆరోపించారు. భార్యాపిల్లలను వదిలి పార్టీకి కోసం కమిట్మెంట్‌తో పనిచేసిన తనలాంటి వాళ్లకు మిగిలేది ఇదేనా అని ప్రశ్నించారు రమేశ్. కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని అన్నారు. కేవీపీ తన కులపోల్లకే టికెట్లు ఇచ్చిపించుకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో గెలవాలని కాంగ్రెస్ నేతలకే లేదని, కాంగ్రెస్ లో కొందరు టీఆర్ఎస్, మరికొందరు ఈటలకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారాయన. ఐదు సార్లు టికెట్ ఇస్తానని తనను మోసం చేశారని అన్నారు.