
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ మండిపడింది. ట్రంప్.. నాకు మంచి దోస్త్ అని చెప్పుకునే మోదీకి.. అతను చేసే హెచ్చరికలు వినిపించడం లేదా అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు.
ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా కాస్ట్లీ అని మాత్రం అర్థమవుతోందని విమర్శించారు. ఇలాంటి టైమ్‌లో.. బాలీవుడ్ ప్రముఖ సింగర్ ముఖేష్ పాడిన పాట... ‘దోస్త్.. దోస్త్.. నా.. రహా..’ గుర్తుకొస్తున్నదని ఎద్దేవా చేశారు.
‘‘2019, సెప్టెంబర్ ‘హౌడీ.. మోదీ’.. 2020, ఫిబ్రవరిలో ‘నమస్తే ట్రంప్’.. 2025, ఫిబ్రవరిలో ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ స్లోగన్లు ఏమైనయ్? ట్రంప్‌తో అతి స్నేహమే.. దేశానికి ఇబ్బందులు తీసుకొచ్చింది.
‘తారీఫ్ హీ తారీఫ్ మే.. టారిఫ్ లగ్ గయా’ వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి జైశంకర్‌కు మొదటి వరుసలో సీటు అలాట్ చేస్తే గొప్పగా చెప్పుకున్నారు. మరి ట్రంప్ వేస్తున్న టారిఫ్‌లపై ఎందుకు నోరు విప్పడం లేదు? ట్రంప్‌తో మోదీ వైఖరి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందేమో అని భయమేస్తున్నది’’ అని జైరాం రమేశ్ అన్నారు.