రాజ్యసభలో విపక్షాల ఆందోళన

రాజ్యసభలో విపక్షాల ఆందోళన

రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. సభ ఆరంభం నుంచే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఇష్యూపై ఆందోళనకు దిగారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశం పై రాజ్యసభలో విపక్ష ఎంపీల ఇవాళ కూడా ఆందోళన నిర్వహించారు. ఎంపిలపై సస్పెన్షన్ ఎత్తివేయకుండా కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు జీరో అవర్ లో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని సభ్యులకు సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. ప్రభుత్వం తమను రెచ్చగొడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే అన్నారు. అందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.