యూట్యూబ్ లో పెరిగిన స్టాక్ మార్కెట్ కంటెంట్

యూట్యూబ్ లో పెరిగిన స్టాక్ మార్కెట్ కంటెంట్

   కొన్ని ఛానల్స్‌‌‌‌‌‌‌‌‌‌కు  లక్షల్లో సబ్‌‌‌‌స్క్రయిబర్లు
    2021–22 లో రూ. 16,952 లక్షల కోట్లకు పెరిగిన డెరివేటివ్ మార్కెట్‌‌‌‌ టర్నోవర్‌‌‌‌‌‌‌‌


బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ‘రూ. ఐదు వేలతో ఒక్క రోజులోనే రూ. లక్ష సంపాదించొచ్చు’.. యూట్యూబ్​‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ వీడియోలు హల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. కొంతమంది ఇన్వెస్టర్లు ఇలాంటి వీడియోలకు ఆకర్షితులయ్యి, తాము కష్టపడి సంపాదించిన డబ్బులను మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెడుతున్నారు. వీరిలో చాలా మంది తమ చేతులు కాల్చుకుంటున్నారు. రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టర్ల మనసు ఇప్పుడు ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌, ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ వైపు కూడా మరలుతోంది.  తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడం పెరుగుతోంది. కానీ, డెరివేటివ్ మార్కెట్ ఈక్విటీ (షేర్లు) మార్కెట్‌‌‌‌‌‌‌‌లా కాదు. రూల్స్ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. అందుకే కంటెంట్ కోసం  యూట్యూబ్​ వీడియోల బాట పడుతున్నారు రిటైల్ ఇన్వెస్టర్లు. చాలా మంది ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌పైనే బతికేద్దామని ప్లాన్స్ వేసుకుంటున్నారు.  ‘ డెరివేటివ్‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ చేసి నా జీవితానికి  నా సొంత  రూల్స్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంటా. రోజూ 9 టూ 5 జాబ్‌‌‌‌‌‌‌‌ చేయలేను’ అని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ యంగ్ ట్రేడర్ అన్న మాటలివి.  టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3, టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4 సిటీలలోని యంగ్ ఇన్వెస్టర్లు కూడా డెరివేటివ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ వైపు  చూడడం బాగా పెరిగింది. దీని గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్​ ఛానెల్స్‌‌‌‌‌‌‌‌ వైపు చూస్తున్నారు. ఒకటి రెండు  ట్రిక్‌‌‌‌‌‌‌‌లు నేర్చుకొని మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. 

ఆప్షన్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పెరుగుతున్న ఇన్వెస్టర్లు..

కరోనా సంక్షోభం వలన గత రెండేళ్లలో యువత స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి బాగా  ఎంటర్ అయ్యింది. 2021–22 లో  స్పాట్ మార్కెట్ (షేర్లు) టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవలం 8 శాతమే పెరిగి రూ. 165 లక్షల కోట్లకు చేరుకోగా,  స్టాక్ ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌, స్టాక్ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌, ఇండెక్స్ ఫ్యూచర్స్‌‌‌‌‌‌‌‌, ఇండెక్స్ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌ వంటి డెరివేటివ్ మార్కెట్ టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏకంగా రూ. 16,952 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో ఒక్క ఇండెక్స్ ఆప్షన్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ టర్నోవరే రూ. 58 లక్షల కోట్లకు చేరుకుంది. డెరివేటివ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇంతలా పెరగడానికి  కారణం రిటైల్ ఇన్వెస్టర్లు ఇటువైపు చూడడమేనని చెప్పొచ్చు. 

యూట్యూబ్​ పాత్ర.. 

ఆప్షన్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవ్వాలనుకునే ఇన్వెస్టర్లు కొన్ని యూట్యూబ్​ వీడియోలు చూసి మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్నారు. గతంలో స్టాక్ మార్కెట్ వీడియోలు ఇంగ్లీష్‌లో ఉండేవి. గత రెండు మూడేళ్ల నుంచి చూస్తుంటే లోకల్ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లలోనూ వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హిందీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లో ఫైనాన్షియల్ వీడియోలను కంటెంట్‌‌‌‌‌‌‌‌ క్రియేటర్లు తీసుకొస్తున్నారు. వీరిలో చాలా మంది ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో, అక్కడా ఇక్కడా డేటా సేకరించి వీడియోలు చేస్తున్నారు.  చాలా మంది యూట్యూబర్లు వారు చెప్పిన సలహాలను వారే పాటించడం లేదు. ‘వీడియోని క్రియేట్ చేయడం ఈజీ కాని మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ట్రేడ్ చేయడం కష్టం’ అని కొంత మంది కంటెంట్ క్రియేటర్లు చెప్పడాన్ని గమనించొచ్చు.  మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతుండడంతో కంటెంట్ క్రియేషన్‌‌‌‌‌‌‌‌లో అవకాశాలను యూట్యూబర్లు చూస్తున్నారు. టేకాఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా, ఫిన్నోవేషన్‌‌‌‌‌‌‌‌జెడ్‌‌‌‌‌‌‌‌, సీఏ రచన రనదే, ఈలెర్న్‌‌‌‌‌‌‌‌మార్కెట్స్‌‌‌‌‌‌‌‌ వంటి చాలా యూట్యూబ్​‌‌‌‌‌‌‌‌ ఛానెల్స్‌‌‌‌‌‌‌‌కు లక్షల్లో సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఉండడం గమనించాలి. కొన్ని యూట్యూబ్​ ఛానల్స్‌‌‌‌‌‌‌‌ రూ. 5 వేలతోనే  ఒక్కరోజులోనే రూ. 45 లక్షలు సంపాదించొచ్చని వీడియోలు చేస్తున్నాయి. ఈ వీడియోల కింద  ‘మీరు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయ్యా. కిందటి నెలలో నాకు రూ. 6 లక్షల వరకు రిటర్న్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. నా క్యాపిటల్ కేవలం రూ. 8 వేలే. నేను చాలా హ్యాపీ’ అంటూ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇలాంటి థంబ్‌‌‌‌‌‌‌‌నైల్స్‌‌‌‌‌‌‌‌ను యూట్యూబర్లు పెడుతున్నారు. కొన్ని ఛానల్స్ ఇన్వెస్టర్లకు ఫైనాన్షియల్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ను అందించడానికి కంటెంట్‌‌‌‌‌‌‌‌ను అందిస్తుండగా, చాలా ఛానల్స్‌‌‌‌‌‌‌‌ వ్యూస్ పెంచుకోవడానికి అసాధారణమైన థంబ్‌‌‌‌‌‌‌‌నైల్స్‌‌‌‌‌‌‌‌తో వీడియోలు తెస్తున్నాయి.   ఇలాంటి వాటిని ఫాలో అయ్యి చేతులు కాల్చుకోకూడదు.

యూట్యూబ్​ వీడియోలు ఫాలో కావొద్దా? 

స్టాక్ మార్కెట్ బేసిక్స్‌‌‌‌‌‌ను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ వీడియోలు సరిపోతాయి. కానీ, వీటిపై ఆధారపడి దాచుకున్న డబ్బులను ఇన్వెస్ట్‌‌‌‌ చేయడం మూర్ఖత్వం అని నిపుణులు సలహాయిస్తున్నారు. ఎందుకంటే సోషల్‌‌‌‌ మీడియాలోనూ, ఇంటర్నెట్‌‌‌‌లోనూ కనిపించేవి సక్సెస్ స్టోరీలే. ఫెయిలైన స్టోరీలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కనిపించడం లేదు.  మార్కెట్‌‌‌‌లో ట్రేడింగ్ చేసే  ప్రతి వందమందిలో 80 మంది నష్టపోతున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇంకా, ఈక్విటీ (షేర్లు) మార్కెట్‌‌‌‌తో పోలిస్తే డెరివేటివ్ మార్కెట్ చాలా డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్‌‌‌‌లో తక్కువ రేటుకి షేరు కొని ఎక్కువ రేటుకి ఆ షేరుని అమ్మితే సరిపోతుంది. కానీ, ఆప్షన్స్ మార్కెట్‌‌‌‌ ఇంత సింపుల్‌‌‌‌గా ఉండదు. డెరివేటివ్ మార్కెట్‌‌‌‌ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫేమస్ రైటర్ల బుక్స్ చదవాలని, సీనియర్ ట్రేడర్ల వర్క్‌‌‌‌షాపులను ఫాలో కావాలని నిపుణులు సలహాయిస్తున్నారు.