ఫ్లెక్లీలో చైర్​పర్సన్​ ఫొటో  లేదంటూ ఆగ్రహించిన పద్మశాలీలు

 ఫ్లెక్లీలో చైర్​పర్సన్​ ఫొటో  లేదంటూ ఆగ్రహించిన పద్మశాలీలు

జగిత్యాల, వెలుగు: జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ప్రోటో కాల్ వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ ​పాల్గొనే ఈ సమావేశం లో ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీతో వివాదం చెలరేగింది. స్టేజీపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఫొటోతోపాటు పద్మశాలి సామజిక వర్గానికి చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్​పర్సన్​భోగ శ్రావణి ఫొటో పెట్టలేదని పద్మశాలి సంఘ లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇలా చేయడం పద్మశాలీలను అవమానించడమేనని, కొత్త ప్లెక్సీ ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు. లేకపోతే మినిస్టర్ వచ్చిన వెంటనే నిరసన తెలిపి సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తామని ఆఫీసర్లలను హెచ్చరించారు.

దీంతో ఆఫీసర్లు శ్రావణి ఫొటోను ఫ్లెక్సీకి అంటించారు. అనంతరం మినిస్టర్​వచ్చాక విషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. అయితే ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ శ్రావణి గైర్హాజరయ్యారు. అనారోగ్యంతో ఆమె రాలేకపోయారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.