
అవినీతికి పాల్పడితే ఎవరైనా ఎంత సంపాదిస్తారు…వందల కోట్లు..లేదంటే వేల కోట్లు అంతకు మించి ఉండకపోవచ్చు. కానీ ఓ మాజీ మేయర్ మాత్రం లక్షల కోట్లు సంపాదించాడు. అది మన దేశంలో కాదు చైనాలో. హైనాన్ ఫ్రావిన్స్ రాజధాని హైకౌర్ లో మేయర్ గా జాన్ క్వీ విధులు నిర్వహిస్తున్న సమయంలో వేల కిలోల బంగారాన్ని అక్రమంగా సంపాధించినట్లు అధికారులు తేల్చారు. ఇటీవల అతడి అవినీతి భాగోతాలపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 13,500కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ తెలుసుకున్న అధికారులే ఆశ్చర్యపోయారట.
జాన్ క్వీ ఇంట్లో ఎక్కడ చూసినా బంగారు కడ్డీలు, బంగారు ఇటుకలే. వాటి విలువ లెక్కిస్తే రూ.2.68 లక్షల కోట్లని తేలింది. ఇవేకాదు, 37 బిలియన్ డాలర్ల డబ్బు, ఇతర స్థిరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ… కేవలం లంచాల ద్వారానే సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. అతడిపై ఉన్న ఆరోపణలు రుజువైతే అదే దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా వెబ్‌సైట్ అధినేత జాక్‌మా ఆస్తుల కంటే జాన్ క్వీ సంపాదనే ఎక్కువగా ఉండే అవకాశముందంటున్నారు అధికారులు.