అండర్‌‌19 ఇండియా టీమ్‌‌పై కరోనా దెబ్బ

అండర్‌‌19 ఇండియా టీమ్‌‌పై కరోనా దెబ్బ
  • అండర్‌‌19 వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా టీమ్‌‌పై కరోనా దెబ్బ

టరౌబా (ట్రినిడాడ్‌‌): అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌లో ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిగిన ఇండియా టీమ్‌‌ను కరోనా దెబ్బ కొట్టింది. కెప్టెన్‌‌ యశ్‌‌ ధుల్‌‌ సహా ఆరుగురు ప్లేయర్లు కరోనా పాజిటివ్‌‌గా తేలారు. వైస్‌‌ కెప్టెన్‌‌ షేక్‌‌ రషీద్‌‌, బ్యాటర్‌‌ ఆరాధ్య యాదవ్‌‌, వాసు వత్స్‌‌, మానవ్‌, సిద్దార్థ్‌‌ యాదవ్‌‌ ఈ లిస్ట్‌‌లో ఉన్నారు. దాంతో, బుధవారం ఐర్లాండ్‌‌తో జరిగిన గ్రూప్‌‌-బి మ్యాచ్‌‌ నుంచి తప్పుకున్నారు. మిగిలిన ఆటగాళ్లతో నిషాంత్‌‌ సింధు కెప్టెన్సీలో ఈ మ్యాచ్‌‌లో ఇండియా పోటీపడ్డది. టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన మన టీమ్‌‌ 50 ఓవర్లలో 307/5 స్కోరు చేసింది. ఓపెనర్లు హర్నూర్‌‌ సింగ్‌‌ (88), రఘువంశి (79) రాణించారు.  ‘మంగళవారం ముగురికి పాజిటివ్‌‌ రిపోర్ట్‌‌ రాగా ఐసోలేట్‌‌ చేశారు. ఈ రోజు మ్యాచ్‌‌కు ముందు ర్యాపిడ్‌‌ టెస్టులో కెప్టెన్‌‌, వైస్‌‌ కెప్టెన్‌‌ కూడా పాజిటివ్‌‌గా తేలారు. ఈ రిజల్ట్‌‌ను నిర్థారించాల్సి ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా మ్యాచ్‌‌ నుంచి తప్పించాం. దాంతో 11 మందే మిగిలారు’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.