మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు

యూరప్​లో కేసులు పైపైకి

అమెరికాలో కొన్ని వారాలుగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నయ్. రోజుకు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నయ్. కేసుల సంఖ్య కోటి మార్క్ ను దాటేసింది. థర్డ్ వేవ్ గురించి కొన్ని నెలలు ముందుగా ఎపిడెమియాలజిస్టులు హెచ్చరించారు. అట్లాంటిక్ తీరం వెంబడి పరిస్థితి దారుణంగా ఉంది.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న అమెరికా, ఇండియా, బ్రెజిల్ లో.. గత నెల నుంచి అమెరికాలో మాత్రమే రెండంకెల గ్రోత్  నమోదవుతోంది. ఇండియాలో గతంలో రోజుకు లక్ష వరకు కేసులు నమోదైనప్పటికీ.. రోజువారీ కేసుల్లో పీక్ లో ఉన్న సెప్టెంబర్ తో పోలిస్తే సగటున సగానికన్నా తక్కువ కేసులు నమోదవుతున్నయి. ఈ రెండు దేశాలతో పోలిస్తే బ్రెజిల్ తర్వాతి స్థానంలో ఉంది.

యూరప్ లో సెకండ్ వేవ్

యూరప్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నయ్. ప్రస్తుతం కరోనా కేసుల్లో టాప్ టెన్ కంట్రీస్ లో ఏడు దేశాలు యూరప్ కు చెందినవే కావడం గమనార్హం. నవంబర్ లో ఇండియా తరహాలోనే ఫ్రాన్స్ లోనూ కేసుల సంఖ్య నమోదవుతోంది. ఇటలీ, యూకే, పోలాండ్ లో బ్రెజిల్ కన్నా ఎక్కువ కేసులు రికార్డవుతున్నాయి.

వింటర్ వర్రీ

వింటర్ లో సెకండ్ వేవ్ వస్తోందని ఎడిపెడిమియాలజిస్టులు ఇదివరకే హెచ్చరించారు. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వింటర్ స్టార్ట్ కాగానే సెకండ్ వేవ్ మొదలైనట్టు డేటా చెబుతోంది.

వింటర్ క్రైసిస్

అమెరికాతోపాటు యూరప్ దేశాల్లో రోజుకు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నయ్. కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా సిటీలు, దేశాలు మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై సీరియస్ గా ఆలోచిస్తున్నయ్.

ఢిల్లీలో పరిస్థితి దారుణం

నవంబర్ లో ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో లక్ష వరకు కేసులు రికార్డయ్యాయి. నేషనల్ కేపిటల్ రీజియన్ కు పొరుగున ఉన్న జిల్లాలో రెండంకెల గ్రోత్ నమోదైంది. బెంగళూరు అర్బన్ లో 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్, కేరళలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

మన దగ్గర ఆందోళనగానే ఉంది

మన దేశంలోని 11 రాష్ట్రాల్లో నవంబర్‌లో 20 వేలకుపైగా కేసులు రికార్డయ్యా యి. మొదటి 15 రోజుల్లో ఢిల్లీలో లక్ష కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ ఉండగా, 70 వేల కేసులతో మహారాష్ట్ర మూడో ప్లేస్‌లో ఉంది.

రెండంకెల గ్రోత్
కేసుల సంఖ్య కన్నా.. కేసుల పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోంది. 11 రాష్ట్రాలకు గాను ఆరింటిలో ఒక్కనెలలో 20 వేల కేసులు నమోదు కాగా.. కేసులు 12 శాతం నుంచి 25 శాతానికి పెరిగాయి. ఢిల్లీలో థర్డ్ వేవ్ వచ్చినట్టు కనిపిస్తోంది. పొరుగున ఉన్న హర్యానా, రాజస్థాన్‌లో సెకండ్ వేవ్ ఇప్పటికే మొదలైంది. వెస్ట్ బెంగాల్, కేరళ, చత్తీస్ గఢ్‌లో కేసులు పీక్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

For More News..

జీహెచ్ఎంసీలో టికెట్ల లొల్లి షురూ