కండక్టర్‎కు కరోనా.. డిపోకు ఖాళీ బస్సు

V6 Velugu Posted on Jan 16, 2022

హనుమకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేగింది. వరంగల్ లోకల్ బస్సుకు చెందిన ఓ మహిళా కండక్టర్‌కి కరోనా సోకింది. ఆ కండక్టర్ 15 రోజుల పాటు సిక్ లీవ్‌లో ఉండి రెండు రోజుల క్రితమే డ్యూటీలో జాయిన్ అయినట్లు సమాచారం. కండక్టర్ చెన్నూరు నుంచి హనుమకొండకు వెళ్లాల్సిన బస్సులో కండక్టర్‎గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా.. శనివారం నుంచి ఆమెకు దగ్గు వస్తుండటంతో చెన్నూరు బస్టాండ్‎లో అధికారులు ఆంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ చేయించారు. ఆ పరీక్షలో కండక్టర్‎కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనలో ఉంది. డ్యూటీ ఆఫీసర్‌కు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కండక్టర్ కు కరోనా సోకడంతో.. అధికారులు బస్సును ఖాళీగా హనుమకొండకు పంపించారు.

For More News..

అమెజాన్‎లో ఆఫర్ల వెల్లువ.. రూ. 1.6 లక్షల టీవీ రూ. 79 వేలకే..

వామ్మో.. జయమ్మ పంచాయితీ మామూలుగా లేదుగా

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన

Tagged Telangana, corona virus, Corona Positive, chennuru, bus conductor, Hanumakonda bus depot

Latest Videos

Subscribe Now

More News