పైలట్‌‌‌‌కు కరోనా: మాస్కో నుంచి ఫ్లైట్ వెంటనే వెనక్కి

పైలట్‌‌‌‌కు కరోనా: మాస్కో నుంచి ఫ్లైట్ వెంటనే వెనక్కి

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా టెస్ట్ లు చేస్తున్న సిబ్బంది పొరపాటు కారణంగా మాస్కో వెళ్తున్న ఫ్లైట్ ను మధ్యలోనే వెనక్కి తెప్పించారు. పైలట్ కు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ గమనించకుండా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు.  క్లియరెన్స్​ రావడంతో ఆ పైలట్ ఢిల్లీ నుంచి మాస్కో కు ఫ్లైట్ లో బయలుదేరాడు. వందే భారత్ లో భాగంగా మాస్కో లో ఉన్న మనవాళ్లను తీసుకొచ్చేందుకు ఈ ఫ్లైట్ బయలుదేరింది. ఫ్లైట్ లో ఎయిర్ ఇండియా సిబ్బంది తప్ప ప్యాసింజర్లు ఎవరూలేరు. ఆ తర్వాత మెడికల్ టీమ్ పొరపాటును గుర్తించింది. మాస్కో వెళ్లిన ఎయిర్ ఇండియా పైలట్ కు కరోనా ఉన్నట్లు ఎయిర్ ఇండియా అధికారులకు తెలిపింది.

అప్పటికే  A-320 నియో (వీటీ-ఈఎక్స్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) ఫ్లైట్ ఉజ్బెకిస్తాన్ వరకు వెళ్లింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు విమానాన్ని వెంటనే వెనక్కి పిలిపించారు. పైలట్ ను హాస్పిటల్ లో చేర్పించి మిగతా సిబ్బందిని క్వారంటైన్ కి పంపించారు. విమానాన్ని శానిటైజ్ చేశారు. లేటుగానైనా పైలట్ కు కరోనా వచ్చినట్లు గుర్తించటంతో మాస్కో నుంచి వచ్చే వారికి ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎంక్వైరీకి ఆదేశించింది. సంఘటనపై పూర్తి స్థాయి సమాచారంతో రిపోర్ట్​ ఇవ్వాలని ఎయిర్ ఇండియాను కోరింది.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..