పిల్లలు జర భద్రం..తీవ్రత చెప్పలేం

పిల్లలు జర భద్రం..తీవ్రత చెప్పలేం

కొవిడ్ మహమ్మారి వచ్చిన మొదట్లో పిల్లలపై దాని ఎఫెక్ట్ తక్కువగానే ఉండేది. ఫస్ట్​వేవ్​లో కొవిడ్​ సోకిన పిల్లల్లో ఎక్కువమందిలో ఏ లక్షణాలు (అసింప్టమాటిక్​) కనిపించలేదు. సెకండ్​ వేవ్​లో సింప్టమాటిక్​ కేసులు పెరిగాయి. ఈ పరిస్థితులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవేర్​నెస్​ ఉంటే చాలని అంటున్నారు పిడియాట్రీషియన్​ డాక్టర్​ షర్మిల. కె. 

ఫస్ట్ వేవ్​లో పిల్లల్లో కరోనా ప్రభావం తక్కువే. కేసులు తక్కువగా ఉండటానికి అప్పుడు లాక్​ డౌన్ ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. లాక్​డౌన్​ ఉన్నా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం తల్లిదండ్రులు బయటికిపోక తప్పట్లేదు. వాళ్ల ద్వారా పిల్లలకు కొవిడ్​ సోకే ప్రమాదం ఉంది. ఫస్ట్ వేవ్​లో కొవిడ్​ బారినపడిన పిల్లల్లో శ్వాస, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్​ వేవ్​లో మాత్రం కొంచెం ప్రమాదకరమైన లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. 

తీవ్రత చెప్పలేం

  • కరోనా వైరస్​లో మ్యుటేషన్స్​ వల్ల దాని ప్రభావంలో కూడా మార్పులు వస్తున్నాయి. కొవిడ్​ సెకండ్​వేవ్​లో కరోనా సోకిన పిల్లల్లో కళ్లు ఎర్రబడటం, నోటిపూత, చర్మంపై దద్దుర్లు, కాళ్ల వాపు, చేతుల వాపు, గుండెలోకి రక్తం తీసుకుపోయే రక్తనాళాల వాపు వస్తుంది. దీనిని ‘మల్టీ సిస్టం ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్​’ అంటారు. రక్తనాళాల వాపుకు సరైన ట్రీట్​మెంట్​ చేయకపోతే గుండె చుట్టూ నీరు చేరుతుంది. 
  • దానివల్ల ప్రాణహాని లేదా గుండెజబ్బులు రావచ్చు. కరోనా వైరస్​ మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్​లో దీని దాడి తీవ్రత ఎలా ఉంటుందో ముందే చెప్పలేం. పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉంటూ పిల్లల్ని జాగ్రత్తగా ఉండేలా చూడటమే ఎవరమైనా చేయగలిగింది. 

ప్రకృతి వార్నింగ్​ ఇస్తోంది

  • సెకండ్ వేవ్​లో కొవిడ్ సోకిన పిల్లల​ డెత్​రేటు స్వల్పంగా పెరిగింది.​ కొన్ని రాష్ర్టాల్లో అయితే డబుల్ అయిందని అంటున్నారు. కొవిడ్​ బారినపడ్డ వాళ్ల సంఖ్య కర్ణాటక రాష్ర్టంలో 160 శాతం పెరిగింది. ఏ దేశంలో కూడా కొవిడ్​ మహమ్మారిని ఎదుర్కొనేంత హెల్త్ సిస్టమ్​ లేదు. ఉన్న దానిని మ్యాగ్జిమమ్ వాడుకునేందుకు ప్రయత్నించాలి. 
  • మెడికల్​ సిస్టమ్​ మీద ఆధారపడటం కంటే ముందు జాగ్రత్తే కొవిడ్​ నుంచి కాపాడుకోవడానికి బెటర్ మెథడ్. లైఫ్​ స్టయిల్, ఆలోచించే తీరులో మార్పు రావాలని కొవిడ్ అనుభవంతో ప్రకృతి చెబుతోంది.​​ అది పట్టించుకోకపోతే కష్టాలే. 

పిల్లలు జాగ్రత్త 

  • కొవిడ్​ నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏవీ లేవు. పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలు కూడా అవే జాగ్రత్తలు పాటించాలి. 
  • జాబ్, బిజినెస్​, పబ్లిక్​లోకి వెళ్లాల్సి రావడం పెద్దలకు తప్పదు. బయటికి పోయి.. ఇంటికి వచ్చే పెద్దల నుంచే పిల్లలకు కోవిడ్​ సోకుతోంది. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఉండే పిల్లలు సేఫ్​గా ఉంటారు. 
  • వ్యాక్సినేషన్​ ఎంత త్వరగా పూర్తయితే పిల్లలు అంత సేఫ్​గా ఉంటారు. అవకాశం ఉన్న పెద్దవాళ్లంతా త్వరగా వ్యాక్సిన్​ వేయించుకోవాలి. 
  •   పెద్ద వాళ్లు ఇంట్లో కూడా మాస్క్​ పెట్టుకోవాలి. 
  •   అయిదేళ్లలోపు పిల్లలకు మాస్కులు పెట్టొద్దు. 
  •   కొవిడ్​ ఎలా సోకుతుందో పిల్లలకు చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలని ప్రతి రోజూ గుర్తు చేయాలి. కానీ, అది బెదిరించినట్లు ఉండొద్దు. 
  •   ఒకవేళ స్కూల్స్​ తెరిస్తే వెంటనే పంపకుండా, ప్రభుత్వం చెప్పే కొవిడ్​ డేటా, వ్యాక్సినేషన్​ డేటా తెలుసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. 

డాక్టర్ షర్మిల. కె
సీనియర్​ కన్సల్టెంట్​ పిడియాట్రీషియన్, అపోలో హాస్పిటల్,  హైదరాబాద్​