
- పేరున్న డాక్టర్లు ఎక్కడుంటే పేషెంట్లూ అక్కడికే!
- ప్యాకేజీలతో డాక్టర్లకు గాలం వేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్
- కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయక ముందు నుంచే ఫోకస్
- బ్రాంచ్‌కు కనీసం నలుగురు పేరున్న డాక్టర్లు ఉండేలా ప్లానింగ్
- వారికి ఇస్తున్న మొత్తం పేషెంట్ల నుంచి వసూలు!
హైదరాబాద్, వెలుగు: సిటీలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్లు హాస్పిటళ్లు మారితే పేషెంట్లు కూడా అక్కడికే వెళ్తున్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న హాస్పిటళ్లతో పేరున్న డాక్టర్లకు డిమాండ్ పెరిగింది. పేషెంట్లను ఆకర్షించేందుకు యాజమాన్యాలు పేరున్న డాక్టర్లపైనే ఫోకస్ పెడుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి లాగేస్తున్నాయి. సీనియర్ డాక్టర్లు హాస్పిటల్ మారితే ఆటోమేటిక్‌గా రెగ్యులర్‌గా వారి వద్దకు వచ్చే పేషెంట్లు కూడా వస్తారని అంచనా వేస్తున్నాయి. చివరకు ఆ భారమంతా పేషెంట్లపైనే పడుతుంది. డాక్టర్లు మారిన మారితే ట్రీట్ మెంట్ ఖర్చు పెరుగుతోందని పలువురు పేషెంట్లు చెబుతున్నారు. ఓపీ, ఐపీ రేట్లు పెంచకుండా చూడాలని కోరుతున్నారు. అన్నిచోట్ల ఒకేలా ఉండేలా చూడాలంటున్నారు. అయితే సీనియర్ డాక్టర్ల ఫీజులు అధికంగా ఉంటున్నా డైలీ వారి వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గడం లేదు. ఇదే కార్పొరేట్హాస్పిటల్స్కు వరంగా మారింది.
20 వేల మంది డాక్టర్లు
సిటీ వ్యాప్తంగా 200లకుపైగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండగా, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ 2 వేలకు పైనే ఉన్నాయి. వీటిలో 15 వేల నుంచి 20 వేల మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. డైలీ లక్ష మంది
పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మెడిసిన్పూర్తిచేసిన డాక్టర్లు ఫీల్డ్‌లోకి వస్తున్నప్పటికీ గతంలో ఉన్న డాక్టర్ల పేర్లు చెక్కు చెదరడంలేదు. ఎంత మందిని సంప్రదించినా చివరకు పేరున్న డాక్టర్ ని ఒకసారి కన్సల్ట్ అవుదామని అనుకునే పేషెంట్లు వేలల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ డాక్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లోని పేరున్న డాక్టర్ల ఓపీ కన్సల్టెన్సీ ఫీజులు అధికంగా ఉంటున్నాయి. ఫీజులు ఎంతున్నా వారి వద్దకు వస్తున్న పేషెంట్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
బ్రాంచీలు పెరుగుతున్నయ్
గతంలో చిన్నగా మొదలైన ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటల్స్ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. కరోనా తర్వాత చాలా హాస్పిటల్స్బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తవాటికి పేషెంట్లను ఎలా రప్పించాలనే దానిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. అవసరమైతే స్పెషల్ఫండ్స్కేటాయిస్తున్నాయి. మార్కెటింగ్ కోసమే అధికంగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేరు, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లకు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తున్నాయి. ప్రతి కొత్త బ్రాంచ్‌లో కనీసం నాలుగైదు మంది పేరున్న డాక్టర్లు ఉండేలా చూస్తున్నాయి.
‘‘జూబ్లీహిల్స్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే ఫేమస్, సీనియర్ కార్డియాలజిస్ట్ఒకరు ఇటీవల గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు మారాడు. ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి తీసుకున్నట్లు తెలిసింది. సదరు డాక్టర్ వద్దకు డైలీ 200 మందికి పైగా పేషెంట్లు వస్తారని సమాచారం.’’
‘‘మలక్‌పేటలోని ఓ హాస్పిటల్ లో పనిచేసే సీనియర్ నెఫ్రాలజిస్ట్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. అంతకు ముందు ఉన్న హాస్పిటల్లో ఈయన వద్దకు రెగ్యులర్‌గా 300 నుంచి 400 మంది పేషెంట్లు వచ్చేవారు. ప్రస్తుతం వారిలో సగం మంది డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్‌కే వెళ్తున్నారు.’’
పేషెంట్లపై భారం వేయొద్దు
డాక్టర్లు హాస్పిటల్స్ మారడం వారి వ్యక్తిగత విషయం. కానీ డాక్టర్లకు ఉన్న డిమాండ్‌ని బట్టి హాస్పిటల్స్ ఫీజులు వసూలు చేయడం కరెక్ట్ కాదు. డాక్టర్లకు ఎక్కువ మొత్తంలో ప్యాకేజీలు ఇస్తూ..
ఆ పైసలను పేషెంట్ల నుంచి వసూలు చేయొద్దు. కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
– జగన్, ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం, ప్రెసిడెంట్