రాయికల్​ మున్సిపల్​ అవిశ్వాసంపై యూటర్న్​

రాయికల్​ మున్సిపల్​ అవిశ్వాసంపై యూటర్న్​

రాయికల్​, వెలుగు: రాయికల్​ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ అసంతృప్త కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసును వెనక్కి తీసుకున్నారు. గురువారం చైర్మన్‌‌‌‌‌‌‌‌, హన్మండ్లు, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ రమాదేవితోపాటు కౌన్సిలర్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు.

తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అవిశ్వాస నోటీసును వెనక్కి తీసుకుంటున్నట్లు కౌన్సిలర్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటనను  విడుదల చేశారు. వార్డుల  అభివృద్ధి,  పెండింగ్​బిల్లుల పరిష్కారం కోసమే అవిశ్వాస నోటీసు ఇచ్చామని, ఎలాంటి లాభాపేక్ష లేదని కౌన్సిలర్లు ప్రకటించారు.